The President’s Signature on U.S. Paper Currency : అమెరికా చరిత్రలో మొదటిసారిగా, సిట్టింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన పేపర్ కరెన్సీ (డాలర్ నోట్లు) విడుదల కానుంది.
అధ్యక్షుడు పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి
1861లో డాలర్ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత, పదవిలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్‌ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1861 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మాలెర్బాల సంతకాలు ఉన్న డాలర్ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి.
ట్రంప్ సంతకంతో పాటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకంతో ఇకపై డాలర్ నోట్లను ముద్రించనున్నారు.
ఈ మార్పులతో జూన్‌లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేయనున్నట్టు స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day), జూలై 4న జరుపుకునే ఒక ప్రధాన జాతీయ సెలవుదినం.
1776 జూలై 4న, బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొంది, 13 కాలనీలు సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
బ్రిటీష్ పాలనలోని 13 కాలనీలు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ 1776 జూలై 4న రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ ద్వారా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించాయి.