---Advertisement---
telugujobs.in - 2

భారత్‌లో మాతృమూర్తుల మరణాలు

By: rapolujobs

On: March 28, 2026

Maternal-Deaths-in-India
www.telugujobs.in
  • ప్రసవ సంబంధ మాతృమూర్తుల మరణాలు భారత్‌లో చాలా ఎక్కువగా ఉన్నాయని తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.
  • తాజా నివేదికల ప్రకారం, 2023లో ప్రతిరోజూ సగటున 52 మంది చొప్పున మొత్తం సుమారు 19,000 నుండి 24,700 వరకు ప్రసూతి మరణాలు నమోదయ్యాయి.
  • ప్రసూతి మరణాలలో భారత్‌ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది.
  • దేశంలో సగటున ప్రతిరోజూ 52 మంది తల్లులు ప్రసూతి కారణాలతో మరణిస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాల్లో మాతృ మరణాల నిష్పత్తి (MMR) తక్కువగా ఉంటే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది.
  • ఇది దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంతాల కన్నా అధికమని వెల్లడైంది.
  • అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది.
  • ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి.
  • పాకిస్థాన్‌ విషయంలో ఈ మరణాలు 10,300గా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
  • ఇవి ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో 11,900, నైజీరియాలో 32,900గా ఉన్నట్లు వెల్లడైంది.
  • గత మూడు దశాబ్దాల్లో ప్రసవ సమయంలో మాతృమూర్తుల మరణాలు తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
  • అయితే గత కొన్నేళ్లలో ఈ పురోగతి ఒకింత నెమ్మదించిందని పేర్కొన్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రసవ సంబంధిత సమస్యలతో 2.4 లక్షల మంది తల్లులు చనిపోయారని వివరించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page