---Advertisement---
telugujobs.in - 2

టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వ నైట్‌హుడ్‌ పురస్కారం

By: rapolujobs

On: March 24, 2026

Chandrasekaran
www.telugujobs.in
  • భారత్‌-యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేస్తున్న టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం గౌరవ నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది.
  • దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ‘నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్సెలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (కేబీఈ)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
  • ‘యూకేలో టాటా గ్రూప్‌ దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతోంది. దీని కార్యకలాపాలు వాహన, ఉక్కు, సాంకేతికత, వినియోగదారు రంగాల్లో విస్తరించి ఉన్నాయి.
  • ఇది యూకేలో ఉద్యోగాలకు, అధునాతన తయారీ రంగానికి, స్వచ్ఛమైన సాంకేతికతల వైపు పరివర్తనకు మద్దతు ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
  • టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా, ఆయన అనేక సంవత్సరాలుగా యూకే-భారత వ్యాపార సంబంధాలకు, బ్రిటన్‌లో పెట్టుబడులకు విశేష కృషి చేశార’ని హైకమిషన్‌ తెలిపింది.
  • బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3 తరఫున బ్రిటిష్‌ హైకమిషనర్‌ కామెరాన్‌ ఈ గౌరవ పురస్కారాన్ని చంద్రశేఖరన్‌కు ప్రదానం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page