---Advertisement---
telugujobs.in - 2

దేశంలో తొలి LPG ATM

By: rapolujobs

On: March 19, 2026

LPG-gas-ATM
www.telugujobs.in
  • హరియాణా గురుగ్రామ్‌లో ఉన్న LPG gas ATM పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) AI ఆధారిత గ్యాస్‌ సిలిండర్‌ స్మార్ట్‌ వెండింగ్‌ మెషిన్‌ను ఏర్పాటు చేసింది.
  • ATM మాదిరిగా ఇది పని చేస్తుంది. దీంతో సిలిండర్ల (Cylinders) కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడడం, గంటలపాటు క్యూలో నిల్చోవడం ఉండదు.
  • కేవలం 2-3 నిమిషాల్లోనే సిలిండర్‌ తీసుకోవచ్చు.
  • ఈ ATMలలో లభ్యమయ్యే సిలిండర్లు తేలికగా ఉంటాయి. సాధారణ సిలిండర్లు అందులోని గ్యాస్‌తో కలిపి మొత్తం 31కిలోల బరువు ఉంటాయి.
  • అయితే ఫైబర్‌తో తయారు చేసిన ఈ సిలిండర్లు గ్యాస్‌తో కలిపి కేవలం 15కిలోల బరువు మాత్రమే ఉంటాయి.
  • ఈ ఏటీఎంలో సాధారణ ఇనుప సిలిండర్లకు బదులుగా అత్యాధునిక కంపోజిట్ సిలిండర్లను వాడుతున్నారు.
  • వీటిని తీసుకువెళ్లడం కూడా సులువు. భారత్‌గ్యాస్ కాంపోజిట్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
  • ఒక్కో మెషీన్‌లో 10 సిలిండర్ల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది, స్టాక్ తగ్గగానే ఏజెన్సీకి ఆటోమేటిక్ అలర్ట్ వెళ్తుంది.

LPG గ్యాస్ ATM పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది?
A) ముంబై
B) గురుగ్రామ్ (హరియాణా)
C) హైదరాబాద్
D) చెన్నై
సమాధానం: B

LPG గ్యాస్ ATM ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న సంస్థ ఏది?
A) IOCL
B) HPCL
C) BPCL
D) ONGC
సమాధానం: C

కంపోజిట్ (ఫైబర్) సిలిండర్ బరువు (గ్యాస్‌తో కలిపి) ఎంత?
A) 10 కిలోలు
B) 12 కిలోలు
C) 15 కిలోలు
D) 18 కిలోలు
సమాధానం: C

LPG ATMలో ఉపయోగించే సిలిండర్లు ఏవి?
A) ఇనుప సిలిండర్లు
B) అల్యూమినియం సిలిండర్లు
C) కంపోజిట్ సిలిండర్లు
D) ప్లాస్టిక్ సిలిండర్లు
సమాధానం: C

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page