భారత నౌకాదళం (Indian Navy) లో Agniveer SSR (Senior Secondary Recruit) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 01/2027 మరియు 02/2027 బ్యాచ్‌లకు అగ్నివీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ సముద్ర తీరాలను రక్షించే భారత నౌకాదళంలో చేరాలని ఆశించే యువతకు ఇది మంచి అవకాశం.
దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14 మార్చి 2026
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026
పోస్టు వివరాలు
పోస్ట్ పేరు: అగ్నివీర్ (Senior Secondary Recruit – SSR)
విద్యార్హత
క్రింది అర్హతలలో ఏదో ఒకటి ఉండాలి:
గుర్తింపు పొందిన బోర్డు నుండి Maths, Physics సబ్జెక్టులతో 10+2 (50% మార్కులతో) ఉత్తీర్ణత
లేదా
Mechanical / Electrical వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా
లేదా
Physics & Maths తో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు (50% మార్కులతో)
గమనిక: అభ్యర్థులు తప్పనిసరిగా అవివాహితులు అయి ఉండాలి.
వయోపరిమితి
01/2027 బ్యాచ్:
01 డిసెంబర్ 2004 నుండి 31 మే 2009 మధ్య జన్మించి ఉండాలి.
02/2027 బ్యాచ్:
01 మే 2005 నుండి 31 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు ప్రమాణం: పురుషులు మరియు మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్
Stage-1: Indian Navy Entrance Test (INET)
Stage-2: రాత పరీక్ష
Physical Fitness Test (PFT)
మెడికల్ పరీక్ష
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (INET)
ప్రశ్నపత్రం భాషలు: హిందీ / ఇంగ్లీష్
మొత్తం ప్రశ్నలు: 50 (MCQs)
మార్కులు: 100 మార్కులు
పరీక్ష సమయం: 1 గంట
సబ్జెక్టులు: English, Science, Mathematics, General Awareness
Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ INS Chilka (ఒడిశా) లో జరుగుతుంది.
01/2027 బ్యాచ్: డిసెంబర్ 2026
02/2027 బ్యాచ్: మే 2027
శిక్షణ పూర్తి చేసిన తరువాత ఆయా విభాగాల్లో విధులు నిర్వహించాలి.
జీతభత్యాలు
మొదటి సంవత్సరం నెల జీతం: ₹30,000
ప్రతి సంవత్సరం నిర్ణీత ఇంక్రిమెంట్ ఉంటుంది.
జీతంలో
70% అభ్యర్థికి అందుతుంది
30% Agniveer Corpus Fund కు వెళుతుంది.
నాలుగు సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఇచ్చే వాటాతో కలిపి సుమారు ₹10.04 లక్షలు “Seva Nidhi” కింద అందుతాయి.
దరఖాస్తు ఫీజు
₹550
దరఖాస్తు విధానం
అభ్యర్థులు Indian Navy అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

