---Advertisement---
telugujobs.in - 2

ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్‌

By: rapolujobs

On: March 20, 2026

finland-is-the-happiest-country-in-the-world
www.telugujobs.in
  • ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
  • మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఫిన్లాండ్‌ వరసగా తొమ్మిదో సారి ప్రథమ స్థానం దక్కించుకుంది.
  • నివేదిక ప్రకారం.. నార్డిక్‌ దేశాలైన ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా మొదటి 10 దేశాల్లో స్థానం సంపాదించాయి.
  • 2023లో 23వ స్థానంలో ఉన్న కొస్టారికా ఈ ఏడాది నాలుగో స్థానానికి ఎగబాకింది.
  • అమెరికా ఈ జాబితాలో 23వ స్థానంలో నిలవగా.. కెనడా-25, బ్రిటన్‌ 29వ స్థానాల్లో నిలిచాయి.
  • తాలిబన్ల పాలనలో సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌ ఈ ఏడాది కూడా అత్యంత అసంతృప్తికర దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, మలావి ఉన్నాయి.
  • అత్యంత సంతోషకర దేశాల జాబితాలో భారత్‌ ఈ ఏడాది 116వ స్థానంలో నిలిచింది.
  • 2024లో పొందిన ర్యాంకు 118 కన్నా ఈ దఫా కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది.
  • అవినీతి, దాతృత్వం, స్వేచ్ఛ, తలసరి ఆదాయం, ఆరోగ్యకర జీవనం వంటి విభాగాల వారీగా చూసినప్పుడు ఈ ఏడాది (2026) స్థాయులు చాలా మెరుగయ్యాయి.
  • సంతోషకర దేశాల జాబితాలో నేపాల్‌ 99వ స్థానంలో, పాకిస్థాన్‌ 104వ స్థానంలో ఉండటం గమనార్హం.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page