World Tuberculosis Day: మానవులకు సోకే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి.
ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.
క్షయ వ్యాధి వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 24న ‘వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే’గా నిర్వహిస్తారు.
ఈ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
క్షయ వ్యాధి గురించి..
ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే వైద్యుడు మొదటిసారి ఈ వ్యాధి కారకాన్ని గుర్తించారు.
దీనివల్ల ఊపిరితితుత్తులు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
దీన్ని రికవరీ డిసీజ్ లేదా సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.
అలసట, జర్వం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
వ్యాధిగ్రస్తుల నుంచి గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి నిర్ధారణకు ‘మాంటెక్స్’ పరీక్ష చేస్తారు.
దీనికి చేసే చికిత్స: DOTS (Directly Observed Treatment Short Course).
క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ముఖ్యమైన సూక్ష్మజీవ నాశకం ‘స్ట్రెప్టోమైసిన్’.
చిన్న పిల్లలకు ఇది రాకుండా బి.సి.జి టీకాలు (BCG Bacillus Calmette Guerin) ఇస్తారు.
చారిత్రక నేపథ్యం: జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే వైద్యుడు 1882, మార్చి 24న మొదటిసారి క్షయ వ్యాధి కారకమైన మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను గుర్తించారు.
ఇది రోగ నిర్ధా రణ, చికిత్సకు పునాదిగా నిలిచింది. ఇది జరిగిన వందేళ్లకు 1982లో డబ్ల్యూహెచ్ఓ, IUATLD సంయుక్తంగా ఆ తేదీని ‘వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే’గా గుర్తించాయి.
2018లో, 10 మిలియన్ల మంది క్షయవ్యాధి బారిన పడగా, 1.5 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల జనాభా 170 కోట్లు కాగా, అందులో 58.7 కోట్ల మంది ఆగ్నేయాసియాలో నివసిస్తున్నారు.
ప్రతి సంవత్సరం 4000 మందికి పైగా యూరోపియన్లు ఈ వ్యాధితో మరణిస్తున్నారు.
భారతదేశంలో, సుమారు 25,90,000 మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు, అంటే ప్రతి లక్ష భారత జనాభాలో 188 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2026 యొక్క ఈ సంవత్సరం ఇతివృత్తం ” అవును! మనం క్షయవ్యాధిని అంతం చేయగలం
This year’s theme for World Tuberculosis Day 2026 is “Yes! We Can End TB: Led by countries, powered by people.”
క్షయ వ్యాధి లక్షణాలు
క్షయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గాలి ద్వారా, ముఖ్యంగా దగ్గినప్పుడు, ఆ వ్యాధిని వ్యాపింపజేస్తాడు.
ఫలితంగా, క్షయ వ్యాధి ఉన్నవారు, తమ వ్యాధి ఇతరులకు సోకని స్థితికి వచ్చేంత వరకు, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని మరియు ఇతరులకు దూరంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.
క్షయ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగపడే సాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
మూడు లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు
రక్తం లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు
ఛాతీ నొప్పి, లేదా శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గేటప్పుడు నొప్పి