---Advertisement---
telugujobs.in - 2

ప్రపంచ జల దినోత్సవం – World Water Day

By: rapolujobs

On: March 22, 2026

www.telugujobs.in
  • సమస్త ప్రాణకోటికి నీరు ప్రాణాధారం. ప్రకృతిలో లభించే అతిముఖ్యమైన సహజ వనరుల్లో ఇది ఒకటి.
  • మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థల సమతౌల్యానికి ఇది అత్యంత ఆవశ్యకం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి కొరత, కాలుష్యం, దుర్వినియోగం లాంటివి భూమి స్థిరత్వానికి తీవ్రముప్పును కలిగిస్తున్నాయి.
  • నీటి ప్రాముఖ్యత, దాని సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా (World Water Day) నిర్వహిస్తారు.
  • ప్రపంచవ్యాప్తంగా నీటికి సంబంధించిన సమస్యలను గుర్తించడంతోపాటు నీరు, పారిశుద్ధ్య సంక్షోభాన్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
  • భూమిపై నీరు..
  • విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో భూమిపై మాత్రమే నీరు ఉంది.
  • మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ. (70.7%) జలం ఆవరించి ఉంది.
  • భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే.
  • భూమిపై ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహాసముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది.
  • దీన్ని జీవులు వినియోగించుకోలేవు. మిగిలిన మంచినీరులో మంచు, హిమనీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా, 2.2 బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేదు, 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుద్ధ్య సేవలు లేవు, 2.3 బిలియన్ల మందికి ఇంట్లో సబ్బు, నీటితో చేతులు కడుక్కునే సదుపాయం అందుబాటులో లేదు.
  • భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2019 లో జల్ శక్తి అభియాన్ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్దేశించింది. దీనిని 2019 జూలై 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు, 2019 అక్టోబరు 1 నుంచి 2019 నవంబరు 30 వరకు రెండు దశల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
  • చారిత్రక నేపథ్యం:
  • 1992, జూన్‌ 3 – 14 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరో వేదికగా ఐరాస పర్యావరణం, అభివృద్ధి సమావేశం జరిగింది.
  • నీటి ప్రాముఖ్యత, నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’గా జరపాలని సభ్య దేశాలు భావించాయి.
  • 1993లో మొదటి ‘వరల్డ్‌ వాటర్‌ డే’ను నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page