ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఫిన్లాండ్ వరసగా తొమ్మిదో సారి ప్రథమ స్థానం దక్కించుకుంది.
నివేదిక ప్రకారం.. నార్డిక్ దేశాలైన ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా మొదటి 10 దేశాల్లో స్థానం సంపాదించాయి.
2023లో 23వ స్థానంలో ఉన్న కొస్టారికా ఈ ఏడాది నాలుగో స్థానానికి ఎగబాకింది.
అమెరికా ఈ జాబితాలో 23వ స్థానంలో నిలవగా.. కెనడా-25, బ్రిటన్ 29వ స్థానాల్లో నిలిచాయి.
తాలిబన్ల పాలనలో సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఈ ఏడాది కూడా అత్యంత అసంతృప్తికర దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, మలావి ఉన్నాయి.
అత్యంత సంతోషకర దేశాల జాబితాలో భారత్ ఈ ఏడాది 116వ స్థానంలో నిలిచింది.
2024లో పొందిన ర్యాంకు 118 కన్నా ఈ దఫా కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది.
అవినీతి, దాతృత్వం, స్వేచ్ఛ, తలసరి ఆదాయం, ఆరోగ్యకర జీవనం వంటి విభాగాల వారీగా చూసినప్పుడు ఈ ఏడాది (2026) స్థాయులు చాలా మెరుగయ్యాయి.
సంతోషకర దేశాల జాబితాలో నేపాల్ 99వ స్థానంలో, పాకిస్థాన్ 104వ స్థానంలో ఉండటం గమనార్హం.