- ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.
- వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత, స్వచ్ఛత, ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది.
- దీన్నే వినియోగదారుల హక్కు అంటారు.
- చాలా మందికి దీనిపై అవగాహన లేక నకిలీ వస్తు, సేవల వల్ల మోసపోవడమో లేదా అన్యాయానికి గురవడమో జరుగుతోంది.
- అన్యాయమైన పద్ధతులు, వివక్ష, దోపిడీకి గురికాకుండా వినియోగదారులను రక్షించే లక్ష్యంతో ఏటా మార్చి 15న ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా (World Consumer Rights Day) నిర్వహిస్తారు.
- వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు వారి రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- వినియోగదారుడు అంటే?
- వ్యక్తిగత ఉపయోగం కోసం డబ్బు చెల్లించడం ద్వారా ఏవైనా వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు.
- వీరే ఆ వస్తు లేదా సేవలకు అంతిమ కొనుగోలుదారు అవుతారు. వినియోగదారు వ్యక్తుల సమూహం కూడా కావొచ్చు.
- వీరికి తాము కొన్న వస్తు, సేవల నాణ్యత, స్వచ్ఛత, ధర, ప్రమాణాల గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది.
- వీటిలో ఏది లోపించినా వారు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు.
- చారిత్రక నేపథ్యం
- 1962, మార్చి 15న నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ యూఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల సమస్యలపై కీలక ప్రసంగం చేశారు.
- ఈ స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని 1983లో నిర్వహించారు.
- అప్పటి నుంచి కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని అధికారికంగా జరుపుతోంది.
Multiple Choice Questions
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించబడుతుంది?
A) మార్చి 8
B) మార్చి 15
C) ఏప్రిల్ 5
D) జూన్ 5
సమాధానం: B
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
A) పరిశ్రమల అభివృద్ధి
B) వ్యాపార ప్రోత్సాహం
C) వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం
D) దిగుమతులను పెంచడం
సమాధానం: C
వినియోగదారుల హక్కుల సమస్యలపై యూఎస్ కాంగ్రెస్లో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు?
A) అబ్రహాం లింకన్
B) జాన్ ఎఫ్ కెన్నడీ
C) బరాక్ ఒబామా
D) జార్జ్ బుష్
సమాధానం: B
జాన్ ఎఫ్ కెన్నడీ వినియోగదారుల హక్కులపై ప్రసంగించిన సంవత్సరం ఏది?
A) 1950
B) 1962
C) 1975
D) 1983
సమాధానం: B
మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు?
A) 1975
B) 1983
C) 1990
D) 2000
సమాధానం: B
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న సంస్థ ఏది?
A) యునెస్కో
B) కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్
C) ప్రపంచ బ్యాంక్
D) యునిసెఫ్
సమాధానం: B
వ్యక్తిగత ఉపయోగం కోసం డబ్బు చెల్లించి వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని ఏమంటారు?
A) వ్యాపారి
B) వినియోగదారు
C) సరఫరాదారు
D) తయారీదారు
సమాధానం: B

