---Advertisement---
telugujobs.in - 2

189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

By: rapolujobs

On: March 15, 2026

rare-plant-rediscovered-in-india-after-nearly-189-years
www.telugujobs.in
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్కజాతి ఇటీవల జరిపిన ఓ సర్వేలో మళ్లీ కనిపించింది.
  • 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్‌ జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా హెన్కెలియా మోనోఫిల్లా అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • ఆ తర్వాత కనుమరుగైన ఈ మొక్క, మళ్లీ బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవల చేపట్టిన సర్వేలో కనిపించిందని అధికారులు తెలిపారు.
  • గెస్నేరియాసి కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్కలు సాధారణంగా తేమతో కూడిన అటవీ వాతావరణాల్లో దర్శనమిస్తాయి.
  • భారతదేశంలో జీవవైవిధ్యం పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరంతర సర్వేలు, సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కిచెప్తున్నాయని వృక్షశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

189 సంవత్సరాల తరవాత ఇటీవల మళ్లీ కనిపించిన అరుదైన మొక్కజాతి పేరు ఏమిటి?
A) నెపెంటెస్ ఖాసియానా
B) హెన్కెలియా మోనోఫిల్లా
C) రాఫ్లేసియా ఆర్నాల్డీ
D) ఫికస్ బెంగాలెన్సిస్
సమాధానం: B

హెన్కెలియా మోనోఫిల్లా మొక్క ఇటీవల ఎక్కడ మళ్లీ గుర్తించబడింది?
A) అసోం
B) అరుణాచల్‌ప్రదేశ్
C) మణిపూర్
D) నాగాలాండ్
సమాధానం: B

హెన్కెలియా మోనోఫిల్లా మొక్క మొదటగా ఏ జిల్లాలో గుర్తించబడింది?
A) తవాంగ్
B) లోహిత్
C) పాపుమ్ పారే
D) చాంగ్లాంగ్
సమాధానం: B

హెన్కెలియా మోనోఫిల్లా ఏ కుటుంబానికి చెందిన మొక్క?
A) ఫాబేసి
B) గెస్నేరియాసి
C) పోయేసి
D) రోసేసి
సమాధానం: B

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

You cannot copy content of this page