---Advertisement---
telugujobs.in - 2

జాతీయ టీకా దినోత్సవం

By: rapolujobs

On: March 16, 2026

National Vaccination Day
www.telugujobs.in
  • వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ద్వారా వచ్చే అంటువ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షించే జీవసంబంధ ఉత్పత్తులను టీకాలు (Vaccines) అంటారు.
  • టీకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి.
  • అంటువ్యాధుల నివారణలో టీకాలు శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి.
  • టీకాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం జరుపుతారు.
  • దీనిని జాతీయ రోగనిరోధక దినోత్సవం (National Immunization Day) అని కూడా అంటారు.
  • ఉద్దేశ్యం
  • మార్చుటీకాలు ప్రజారోగ్యంలో ముఖ్య భాగం. వ్యక్తులు, సమాజాన్ని అంటువ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం. వివిధ బ్యాక్టీరియా, వైరస్ మానవులకు చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా
  • మెరుగైన ప్రజారోగ్యం, దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో టీకాల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
  • టీకాలు (Vaccines) అంటే
  • ఒక నిర్దిష్ట వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే జీవసంబంధ ఉత్పత్తిని టీకా అంటారు.
  • టీకాలో సాధారణంగా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలి ఉండే బలహీన లేదా మరణించిన రూపం ఉంటుంది.
  • ఈ పదార్థం శరీర రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి యాంటీబాడీలు (Antibodies) తయారుచేయడానికి సహాయపడుతుంది.
  • ఫలితంగా భవిష్యత్తులో అదే వ్యాధి సోకినా దాని తీవ్రత తగ్గుతుంది లేదా వ్యాధి రాకుండా నివారించవచ్చు.
  • సంబంధిత శాస్త్రాలు
  • ఇమ్యునాలజీ (Immunology): రోగనిరోధక వ్యవస్థపై అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఇమ్యునైజేషన్ టెక్నాలజీ (Immunization Technology): టీకాల తయారీ మరియు అభివృద్ధి సాంకేతికత.
  • ఎడ్వర్డ్ జెన్నర్ (Edward Jenner): ఇమ్యునాలజీ పితామహుడు.
  • చారిత్రక నేపథ్యం
  • ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1988లో కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • భారత ప్రభుత్వం 1995 మార్చి 16న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది.
  • అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 16ను జాతీయ టీకా దినోత్సవంగా జరుపుతున్నారు.

Multiple Choice Questions

జాతీయ టీకా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు?
A) మార్చి 8
B) మార్చి 16
C) ఏప్రిల్ 7
D) జూన్ 5
సమాధానం: B

జాతీయ టీకా దినోత్సవాన్ని మరొక పేరుతో ఏమని అంటారు?
A) జాతీయ ఆరోగ్య దినోత్సవం
B) జాతీయ రోగనిరోధక దినోత్సవం
C) జాతీయ వైద్య దినోత్సవం
D) జాతీయ శుభ్రత దినోత్సవం
సమాధానం: B

రోగనిరోధక వ్యవస్థపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
A) బయోటెక్నాలజీ
B) ఇమ్యునాలజీ
C) మైక్రోబయాలజీ
D) జెనెటిక్స్
సమాధానం: B

టీకాల తయారీ మరియు అభివృద్ధి సాంకేతికతను ఏమంటారు?
A) బయోటెక్నాలజీ
B) ఇమ్యునైజేషన్ టెక్నాలజీ
C) మైక్రో టెక్నాలజీ
D) మెడికల్ టెక్నాలజీ
సమాధానం: B

ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
A) లూయిస్ పాస్చర్
B) ఎడ్వర్డ్ జెన్నర్
C) రాబర్ట్ కొచ్
D) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
సమాధానం: B

ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాన్ని WHO ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
A) 1985
B) 1988
C) 1990
D) 1995
సమాధానం: B

భారతదేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించబడింది?
A) 1992 మార్చి 16
B) 1995 మార్చి 16
C) 1998 మార్చి 16
D) 2000 మార్చి 16
సమాధానం: B

టీకాలు శరీరంలో ఏ పదార్థాల తయారీకి సహాయపడతాయి?
A) హార్మోన్లు
B) యాంటీబాడీలు
C) ఎంజైములు
D) విటమిన్లు
సమాధానం: B

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

You cannot copy content of this page