- ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’ విడుదల చేసిన నీతి ఆయోగ్
- ఆర్థిక ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’ నివేదికలో పేర్కొంది.
- మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒక గ్రూప్‌గా చేసి విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి మూడు స్థానాలను ఒడిశా, గోవా, ఝార్ఖండ్లు ఆక్రమించాయి.
- చివరి మూడు స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు నిలిచాయి.
- ఆంధ్రప్రదేశ్ 23.1 స్కోర్‌తో 17వ స్థానానికి పరిమితమైంది.
- ఇందులో రాష్ట్రానికి ఖర్చుల నాణ్యతలో (క్వాలిటీ ఎక్స్పెండిచర్)లో 43.1, ఆదాయ సమీకరణలో 21.7, డెట్ ఇండెక్స్‌లో 36.6 మార్కులు వచ్చాయి.
- ఆర్థిక క్రమశిక్షణలో 9.9, అప్పుల సుస్థిరతలో 4.2 మార్కులు మాత్రమే దక్కాయి.
- రాష్ట్రం ఆదాయం-వ్యయం మధ్య నిరంతరం అసమతౌల్యత కొనసాగుతున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
- ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24’ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
A) RBI
B) నీతి ఆయోగ్
C) ఆర్థిక మంత్రిత్వ శాఖ
D) ప్రపంచ బ్యాంక్
సమాధానం: B) నీతి ఆయోగ్ - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్యంలో ఏ స్థానంలో ఉంది?
A) 15వ స్థానం
B) 16వ స్థానం
C) 17వ స్థానం
D) 18వ స్థానం
సమాధానం: C) 17వ స్థానం - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
A) గోవా
B) ఝార్ఖండ్
C) ఒడిశా
D) తెలంగాణ
సమాధానం: C) ఒడిశా - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24లో రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
A) ఝార్ఖండ్
B) గోవా
C) కర్ణాటక
D) తెలంగాణ
సమాధానం: B) గోవా - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24లో మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) ఝార్ఖండ్
D) కేరళ
సమాధానం: C) ఝార్ఖండ్ - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24లో చివరి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఏది?
A) తమిళనాడు
B) పంజాబ్
C) గుజరాత్
D) కర్ణాటక
సమాధానం: B) పంజాబ్ - ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023–24లో ఆంధ్రప్రదేశ్ సాధించిన స్కోర్ ఎంత?
A) 21.3
B) 23.1
C) 25.4
D) 27.6
సమాధానం: B) 23.1

