- దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా ఎయిర్ మార్షల్ రాహుల్ భాసిన్ నియమితులయ్యారు.
- ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఎయిర్ మార్షల్ ప్రవీణ్ కేశవ్ వోహ్రా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- రాహుల్ భాసిన్ 1990లో భారత వైమానిక దళంలో (Indian Air Force) చేరారు.
- ఆయనకు 3,500 గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది.
- తన సేవాకాలంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ అధికారిగా పనిచేశారు.
- అలాగే ఫైటర్ ఎయిర్ బేస్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ గా సేవలు అందించారు.
- ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ఆపరేషన్స్ – స్పేస్) గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
- 2011లో రాష్ట్రపతి చేతుల మీదుగా వాయుసేన మెడల్ అందుకున్నారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా ఎయిర్ మార్షల్ రాహుల్ భాసిన్
By: rapolujobs
On: March 13, 2026
www.telugujobs.in


