---Advertisement---
telugujobs.in - 2

దేశంలో కుబేరులు

By: rapolujobs

On: March 12, 2026

FORBES-Indias-billionaire
www.telugujobs.in
  • భారత్‌లో బిలియనీర్ల (కుబేరుల) సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 205 మంది ఉండగా, ఈ ఏడాది 229కి చేరినట్లు ఫోర్బ్స్‌ జాబితా వెల్లడించింది.
  • స్టాక్‌మార్కెట్లు రాణించడం, కొత్త కంపెనీల లిస్టింగ్‌ల కారణంగా పలు రంగాల్లో సంపద పెరగడం ఇందుకు కారణమైంది.
  • భారత బిలియనీర్ల మొత్తం సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.92 లక్షల కోట్ల)ను అధిగమించింది.
  • 2025లో ఇది 941 బి. డాలర్లుగా ఉంది.
  • అగ్రగామి 10 మంది భారతీయ కుబేరుల చేతిలో 368 బి. డాలర్ల (రూ.33.85 లక్షల కోట్ల) సంపద ఉంది.
  • దేశంలోని మొత్తం బిలియనీర్ల సంపదలో ఇది మూడో వంతు కంటే ఎక్కువ. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 32 బి. డాలర్లు పెరిగింది.
  • 100 బి. డాలర్ల దిగువనే..: భారత్, ఆసియాలో అగ్రగామి కుబేరుడుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కొనసాగారు.
  • గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12% పెరిగింది. రెండేళ్ల కిందట సాధించిన 100 బి. డాలర్ల మార్కుకు కాస్త దిగువనే ఉన్నారు.
  • ఇక రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ నిలిచారు. వీరిరువురూ తమ సంపదకు 14.7 బి. డాలర్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్ల)ను జత చేశారు.
  • ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా నిలిచారు.
  • నాలుగో స్థానంలో ఉన్న లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిత్తల్‌ షేర్లు ఏడాది కాలంలో 80% పెరగడంతో సంపద 61% (11.8 బి. డాలర్లు) పెరిగి 31 బి. డాలర్లకు చేరింది.
  • కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ తొలిసారిగా టాప్‌ 10 భారతీయ కుబేరుల జాబితాలోకి చేరారు.
  • జాబితాలో అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిగా పర్‌ప్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ శ్రీనివాస్‌(31) నిలిచారు.
  • నవంబరులో కంపెనీ ఐపీఓ నేపథ్యంలో, ఫిజిక్స్‌వాలా సహ వ్యవస్థాపకులైన అలఖ్‌ పాండే, ప్రతీక్‌ మహేశ్వరి బిలియనీర్ల జాబితాలోకి వచ్చారు.

Multiple-choice questions (MCQs) 

భారత్ మరియు ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు?
A) గౌతమ్ అదానీ
B) లక్ష్మీ మిత్తల్
C) ముకేశ్ అంబానీ
D) ఉదయ్ కోటక్
సమాధానం: C) ముకేశ్ అంబానీ

భారత బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నది ఎవరు?
A) లక్ష్మీ మిత్తల్
B) గౌతమ్ అదానీ
C) సావిత్రి జిందాల్
D) ఉదయ్ కోటక్
సమాధానం: B) గౌతమ్ అదానీ

భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు?
A) రోష్ని నాదర్
B) సావిత్రి జిందాల్
C) నితా అంబానీ
D) కిరణ్ మజుందార్ షా
సమాధానం: B) సావిత్రి జిందాల్

టాప్-10 భారతీయ కుబేరుల జాబితాలో తొలిసారిగా చేరిన వ్యక్తి ఎవరు?
A) ఉదయ్ కోటక్
B) కేపీ సింగ్
C) రాధాకిషన్ దమాని
D) శివ్ నాదర్
సమాధానం: A) ఉదయ్ కోటక్

జాబితాలో అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తి ఎవరు?
A) అలఖ్ పాండే
B) ప్రతీక్ మహేశ్వరి
C) అరవింద్ శ్రీనివాస్
D) రోహిత్ శర్మ
సమాధానం: C) అరవింద్ శ్రీనివాస్

భారత బిలియనీర్ల మొత్తం సంపద విలువ ఎంత దాటింది?
A) 500 బిలియన్ డాలర్లు
B) 700 బిలియన్ డాలర్లు
C) 1 ట్రిలియన్ డాలర్లు
D) 2 ట్రిలియన్ డాలర్లు
సమాధానం: C) 1 ట్రిలియన్ డాలర్లు

భారతదేశంలోని అగ్రగామి 10 మంది కుబేరుల సంపద మొత్తం ఎంత?
A) 300 బి. డాలర్లు
B) 368 బి. డాలర్లు
C) 420 బి. డాలర్లు
D) 500 బి. డాలర్లు
సమాధానం: B) 368 బి. డాలర్లు


Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

You cannot copy content of this page